telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నేడే విడుదల ..కాళేశ్వరం … జగన్ వచ్చునా..!

kaleswaram project opening today

నేటి ఉదయం 8.30గంటలకు సీఎం కేసీఆర్ మేడిగడ్డకు చేరుకుంటారు. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా హోమం, యజ్ఞం నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి 10.30గంటల మధ్య గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్.. మేడిగడ్డకు చేరుకుంటారు. వారు కూడా హోమం, యజ్ఞంలో పాల్గొంటారు. ఆ తరువాత.. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి అంకితం చేస్తారు. తరువాత కన్నేపల్లి పంప్‌హౌస్‌కు చేరుకుంటారు. ఒక మోటారు స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేస్తారు. మంత్రి ఈటెల రాజేందర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం 6వ ప్యాకేజీలోని అండర్ టన్నెల్ పనులను సీఎస్‌ ఎస్కే జోషి, బ్యాంకర్ల ప్రతినిధులు పరిశీలించారు. సర్జ్‌పూల్, పంప్‌ హౌజ్ నిర్మించిన తీరును అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పం వల్లే అనతి కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తైందని సీఎస్ జోషి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో.. భద్రతను కట్టుదిట్టం చేశారు. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. 4వేల మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు.

Related posts