telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

‘కాళేశ్వరం’ మూడో వెట్ రన్ సక్సెస్

kaleshwaram pump

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం భారీ ప్రాజెక్ట్ లో మరో వెట్ రన్ విజయవంతమైంది.పెద్దపల్లి జిల్లా నందిమేడారం వద్ద భూగర్భంలో నిర్మించిన పంప్ హౌస్ లో మూడో మోటార్ వెట్ రన్ ఇవాళ నిర్వహించగా విజయవంతమైంది. మూడో పంపు వెట్ రన్‌ను నీటి పారుదల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్ రావ్ దేశ్ పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు ప్రారంభించారు. వెట్ రన్ సక్సెస్‌తో అధికారులు ఆనందంలో మునిగిపోయారు.

మూడో వెట్ రన్ విజయవంతం కావడంతో సాయంత్రం నాలుగో మోటర్ వెట్ రన్‌ను అధికారులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి కీలకమైన తొలి రెండు వెట్ రన్ లు విజయవంతమైన సంగతి తెలిసిందే. గత నెల 24, 25వ తేదీల్లో మొదటి, రెండో మోటర్లు వెట్ రన్ నిర్వహించిన అధికారులు, ఈ రోజు మూడో మోటర్ వెట్ రన్ చేపట్టారు.

Related posts