telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘తుపాకి 2’లో విజయ్ తో రొమాన్స్ చేయనున్న కాజల్

kajal

ఓ వైపు కుర్ర హీరోలతో నటిస్తూనే సినీయర్స్ కూడా రొమాన్స్ చేస్తోంది. కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా వస్తోన్న ఇండియన్ 2’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా కాజల్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్ళినట్టు తెలిసింది. తమిళ సూపర్ స్టార్ విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో ‘తుపాకి 2’ మొదలుకానుంది. ఇందులో హీరోయిన్‌గా కాజల్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన తుపాకి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో విజయ్ కాజల్ అగర్వాల్ జంట అదిరిపోయింది. ఈ ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా బాగా కుదిరింది. దీంతో మరోసారి విజయ్‌తో జోడిగా కాజల్ ఉంటూనే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట.

Related posts