telugu navyamedia
telugu cinema news trending

అల్లరి నరేష్ సరసన కాజల్

allarinaresh

కమల్‌హాసన్‌కు జోడీగా `భారతీయుడు-2`లో నటిస్తోంది కాజల్ అగర్వాల్. తాజాగా తెలుగులో మరో ఆసక్తికర సినిమాకు కాజల్ ఓకే చెప్పిందట. కొరియా సినిమా `డ్యాన్సింగ్ క్వీన్` తెలుగు రీమేక్‌లో కాజల్ నటించబోతోందట. ఈ సినిమాలో కాజల్‌తోపాటు అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన సురేష్ బాబు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాజల్ తమ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే ఈ సినిమాకు ఇంకా దర్శకుణ్ని ఎంపిక చేయలేదని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.

Related posts

ఇస్మార్ట్ శంకర్ : “జిందాబాద్… జిందాబాద్…” రొమాంటిక్ వీడియో సాంగ్

vimala p

తృణ‌మూల్ కాంగ్రెస్ నుండి తప్పుకున్న మ‌రో ఎమ్మెల్యే…

Vasishta Reddy

“జెర్సీ” హిందీ రీమేక్ కు “నో” చెప్పిన రష్మిక మందన్న?

vimala p