telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పెళ్లి తర్వాత కూడా తగ్గని కాజల్ జోరు…

Kajal

తనవైన సోయగాలతో కుర్రకారు మనసుల్ని దోచేసింది కాజల్ అగర్వాల్. అయితే సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్‌కి పెళ్లైతే ఆమెకు ఆఫర్లు తగ్గుతాయి. ఈ అమ్మడు విషయంలో మాత్రం అలా జరగలేదు. కొన్నాళ్ల పాటు స్నేహితుడు, బెజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూతో ప్రేమాయణం సాగించిన తరువాత ఎట్టకేలకు గతేడాది ఆగస్టు 30న వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయ్యే సమయానికి చిరంజీవి సరసన ఆచార్య సినిమా చేస్తుంది. ఇదే అమ్మడి ఆఖరి చిత్రం ఇక మీదట అమ్మడుకి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని భావించారు. కానీ ఈ అమ్మడు విషయంలో అంతా తారుమారైంది. ప్రస్తుతం ఈ అమ్మడు చాలా బిజీగా గడుపుతోంది. కాజల్ చేతిలో ఇప్పటికే ముంబై సాగా, ఇండియన్2, ఆచార్య సినిమాలు ఉన్నాయి. ఇవికాక తమిళంలో స్టార్ హీరో విజయ్ ఇళయదలపతి చేయనున్న తుపాకీ2లో కూడా కాజల్ నటించనుంది. ఇలా మొత్తం నాలుగు పెద్ద సినిమా ప్రాజెక్టులను వరుసగా చేయనుంది. ఇంతలో ఈమె చేతికి మరో భారీ చిత్రం వచ్చింది. స్టార్ హీరో సూర్య, మాస్ దర్శకుడు హరి కాంబోలో తెరకెక్కనున్న సినిమా కూడా కాజల్ చేతిలో పడింది. దాంతో పాటుగా మరో అగ్ర తమిళ్ హీరో విక్రమ్ నటించనున్న సినిమాలో కూడా కాజల్ కథానాయికగా కనిపించనుంది. ఇలా పెళ్లి తృహతవః కూడా బ్రేకులు లేకుండా జోరుగా దూసుకపోతుంది కాజల్.

Related posts