telugu navyamedia
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో చందమామ కాజల్

Kajal-Agarwal

డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ టైం వ‌చ్చింది. ఓ వెబ్ సిరీస్‌లో కుర్ర హీరో వైభ‌వ్ స‌ర‌స‌న న‌టించేందుకు సిద్ధ‌మైంద‌ట‌. ఇందులో వైభ‌వ్, కాజ‌ల్ స్నేహితులుగా క‌నిపించ‌నున్నార‌ట‌. వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కించనున్న ఈ వెబ్ సిరీస్ ఈ నెల‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. హాట్ స్టార్‌లో దీనిని వీక్షించ‌వ‌చ్చు. కాజ‌ల్ కొద్ది రోజులుగా హాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉండ‌గా, త్వ‌ర‌లో ఇండియ‌న్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నుంది. ఆమె న‌టించిన ర‌ణ‌రంగం, కోమ‌లి చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధ‌మ‌య్యాయి. రాను రాను డిజిట‌ల్ మీడియాకి మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతుండ‌డంతో స్టార్ హీరో, హీరోయిన్‌లు కూడా డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే స‌మంత తాను వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు సిద్ధం కాగా, శ్రీకాంత్ చద‌రంగం అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు. ఇక అల‌నాటి అందాల తార భూమిక కూడా ‘భ్రమ్‌’ అనే ఓ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

Related posts