telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పవన్ తో రెండోసారి జతకట్టనున్న కాజల్…?

Kajal

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వరుసగా సినిమాలను కమిట్ అయ్యారు. ఇప్పటికే వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తిచేసాడుఅయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ తో సినిమా చేస్తున్నాడు పవన్. క్రిష్ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. పీరియాడిక్ స్టోరీతో ఈ సినిమా రానుంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ పవన్ సినిమా ఫిక్స్ అయ్యింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా కన్ఫామ్ అయ్యింది. అయితే ఈ సినిమాను పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ  ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధంచేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను అనుకుంటున్నారట. పవన్ తో కాజల్ మరో సారి జత కడుతుందని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక పవన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో కాజల్ నటించిన విషయం తెలిసిందే. మరి పవర్ స్టార్ – స్టైలిష్ డైరెక్టర్ కాంబోలో చందమామ కాజల్ నటిస్తుందో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Related posts