telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా కష్టాలు చూసి చలించిపోతున్న కాజల్

kajal

కాజల్ అగర్వాల్ తన అభిమానులకు, ఫాలోవర్స్, నెటిజన్స్ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పింది. అయతే తాజాగా కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. కరోనా విషయంలో తన కళ్ల ముందు జరిగిన ఓ యదార్ఘ ఘటనను షేర్ చేసింది. వైరస్ వల్ల ఓ క్యాబ్ డ్రైవర్ పడుతున్న కష్టాన్ని చూసి తనకు చాలా బాధ కలగిందని చెప్పింది కాజల్. ‘క్యాబ్ డ్రైవర్ నా ముందు నిల్చుని ఏడ్చాడు. గత రెండు రోజులుగా తానే మొదటి కస్టమర్ అన్నాడు. కనీసం ఇవాళ అయినా నేను సరుకులు తీసుకెళ్తానని నా భార్య అనుకుంటుందని అన్నాడు’ అని కాజల్ తెలిపింది. గత కస్టమర్ వదిలిపెట్టాక దాదాపు 70కి.మీ. ఖాళీగానే తాను డ్రైవింగ్ కూడా చేశాడని చెప్పింది. అయితే.. అతడి కష్టం చూసి చలించిపోయిన ముద్దుగుమ్మ క్యాబ్ డ్రైవర్‌కు రూ. 500 ఎక్కువగా ఇచ్చింది. కరోనా వైరస్ వల్ల రోజువారి ఆదాయం మీద జీవితం గడిపేవాళ్లు ఎక్కువగా నష్టపోతున్నారంది. అలాంటివారికి కాస్త డబ్బులు ఎక్కువగా ఇవ్వండి అంటూ కాజల్ తన అభిమానులను కోరింది. ఎదుకంటే ఆ రోజుకు మీరే వాళ్ల చివరి కస్టమర్ కావొచ్చు అంటూ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్టు చేసింది కాజల్. అయితే కాజల్ చేసిన పోస్టుకు ఆమె అభిమానులు ప్రసంశలు కురిపిస్తున్నారు.

Related posts