telugu navyamedia
సినిమా వార్తలు

కాజల్ మేకప్ లేకుండా ఇలా…!

Kajal-Agarwal

సినీ ప‌రిశ్ర‌మ అంటే గ్లామ‌ర్ ప్ర‌పంచం. ముఖ్యంగా హీరోయిన్లు అందానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఎబెదుకంటే హీరోయిన్ల కెరీర్ వారి అందం మీదే ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకే హీరోయిన్లు మేక‌ప్ లేకుండా బ‌య‌ట‌కు రారు. చాలామంది హీరోయిన్లు మేక‌ప్ లేకుండా త‌మ మొహాన్ని ప్రేక్ష‌కుల‌కు చూపించే సాహ‌సం చేయ‌రు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ తాజాగా మేక‌ప్ లేకుండా స‌హ‌జంగా ఉన్న త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ధైర్యం చేసి, మ‌న‌సులోని భ‌యాల‌ను ప‌క్క‌నపెట్టి మేక‌ప్‌లేని ఫోటోలు షేర్ చేస్తున్నా. అందం అంటే ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మ‌న‌ల్ని మ‌నం స్వీక‌రించుకోవ‌డ‌మే. శ‌రీరాక‌ర్ష‌ణ‌కు మాత్ర‌మే విలువ ఉన్న ప్ర‌పంచంలో మ‌నం జీవిస్తున్నాం. అందం పెంచే ఉత్ప‌త్తులు, కాస్మెటిక్స్ కోసం ల‌క్ష‌ల్లో వెచ్చిస్తున్నాం. మేక‌ప్ మ‌న‌ల్ని బాహ్యంగా అందంగా త‌యారుచేస్తుంది. కానీ, మ‌న వ్య‌క్తిత్వాన్ని మారుస్తుందా? మ‌న‌ల్ని మ‌నం స్వీక‌రించ‌డంలోనే ఆనందం ఉంది” అని కాజ‌ల్ ఈ పోస్ట్ లో పేర్కొంది. కాజ‌ల్ షేర్ చేసిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Related posts