telugu navyamedia
సినిమా వార్తలు

కాజల్ అభిమానులకు డబుల్ ధమాకా

Kajal

అందాల చందమామ కాజ‌ల్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దకాలం గడుస్తున్నా ఇంకా స‌క్సెస్‌ఫుల్‌ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒక‌వైపు సీనియ‌ర్ హీరోల‌తో, మ‌రోవైపు కుర్ర హీరోల‌తో నటిస్తూనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంటోంది. ఇప్పుడు కాజల్ న‌టించిన ర‌ణ‌రంగం, కోమ‌లి చిత్రాలు ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ఆ రెండు చిత్రాల‌ని మేక‌ర్స్ విడుద‌ల చేయ‌నున్నారు. “ర‌ణ‌రంగం” చిత్రం సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా ఇందులో గ్యాంగ్ స్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు శ‌ర్వానంద్‌. చిత్రంలో కాజ‌ల్‌తో పాటు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఆగ‌స్ట్ 2న విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి కాక‌పోవ‌డంతో ఆగ‌స్ట్ 15న రిలీజ్‌కి సిద్ధ‌మైంది. ఇక జ‌యం ర‌వి, కాజ‌ల్, సంయుక్త హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన త‌మిళ చిత్రం “కోమ‌లి”. ఈ మూవీ కూడా ఆగ‌స్ట్ 15న విడుద‌ల అవుతుంది. ప్ర‌దీప్ రంగ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం స‌రికొత్త క‌థాంశంతో రూపొందుతుంది. మొత్తానికి ఇండిపెండెన్స్ డే రోజు కాజ‌ల్ తన అభిమానులకు రెండు చిత్రాలతో డబుల్ ధమాకా ఇవ్వనుందన్నమాట. మ‌రి ఈ రెండు చిత్రాలు కాజల్ కు ఏ రేంజ్ లో విజయాన్ని అందిస్తాయో చూడాలి.

Related posts