telugu navyamedia
సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ కొత్త బిజినెస్

Kajal-Agarwal

టాలీవుడ్ లో ఇప్పటికీ స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న చందమామ కాజల్ అగర్వాల్. కాజల్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్దకాలం గడుస్తోంది. అయినప్పటికీ గ్లామ‌ర్ విష‌యంలో నేటి త‌రం హీరోయిన్లకు కూడా గ‌ట్టి పోటిని ఇస్తూ అవ‌కాశాల‌ను అంది పుచ్చుకుంటుంది. ఇప్ప‌టికీ తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తుందీమె. అయితే ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ త‌మ సంపాద‌న‌ను సినిమా రంగంలోనే కాదు… ఇత‌ర వ్యాపారాల్లోనూ పెట్టుబడిగా పెడుతున్నారు. హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే కొంద‌రు వారి సంపాద‌నతో భూమ‌లు కోనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతుంటే, మరికొందరు మాత్రం రెస్టారెంట్లు, జిమ్ లాంటి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తారలు సినిమాలతో పాటు బిజినెస్ రంగాల్లోకి కూడా దిగుతున్నారు. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె త‌న సంపాద‌న‌ను బంగారు వ్యాపారంలో పెట్టింది. అంటే ముంబైలో కాజ‌ల్ జ్యూయ‌ల‌రీ షాప్‌ను ప్రారంభించింది. బంగారం విలువ రోజు రోజుకీ పెర‌గ‌డ‌మే కానీ త‌గ్గ‌డం ఉండ‌దు. కాబ‌ట్టి కాజ‌ల్ తెలివిగా ఈ వ్యాపారంలోకి దిగిందని అంటున్నారు విశ్లేషకులు.

Related posts