telugu navyamedia
సినిమా వార్తలు

“ప్యారిస్ ప్యారిస్” సినిమా సెన్సార్ సమస్యలు… కాజల్ స్పందన ఇదీ

Paris-Paris

టాలీవుడ్ చందమామ కాజ‌ల్ బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ “క్వీన్” తమిళ రీమేక్‌ “పారిస్ పారిస్”లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. చిత్ర షూటింగ్ చాన్నాళ్ళ క్రిత‌మే పూర్తికాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది. అయితే కాజ‌ల్ న‌టించిన “పారిస్ పారిస్” చిత్రం ఇటీవలే సెన్సార్‌కి వెళ్ల‌గా, సెన్సార్ స‌భ్యులు దీనిపై అభ్యంతరం వ్య‌క్తం చేశారు. బూతు ప‌దాలు, బోల్డ్ విజువ‌ల్స్ ఉండ‌డంతో వాటిని తొల‌గించ‌డంతో పాటు కొన్నింటిన బ్ల‌ర్ చేయాల‌ని చిత్ర యూనిట్‌కి సీబీఎఫ్‌సీ సూచించింద‌ట‌. మెడియంటే ఫిలింస్ బేన‌ర్‌పై మ‌ను కుమార‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “క్వీన్” చిత్రం సౌత్ లోని నాలుగు భాషలలో రీమేక్ కాగా, హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషించారు. “క్వీన్” రీమేక్ చిత్రం కన్నడలో “బటర్ ఫ్లై” అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తమిళంలో “పారిస్ పారిస్”, మలయాళంలో “జామ్ జామ్”, తెలుగులో “దటీజ్ మ‌హాల‌క్ష్మీ” అనే టైటిల్స్ తో రూపొందుంది. తెలుగు వ‌ర్షెన్‌ని అ చిత్ర ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేయ‌గా, కన్న‌డ వ‌ర్షెన్‌ని ర‌మేష్ అర‌వింద్‌, త‌మిళ వ‌ర్షెన్‌ని కూడా రమేష్ అరవింద, మ‌ల‌యాళ వ‌ర్షెన్‌ని నీల‌కంఠ‌ తెర‌కెక్కించారు.

మిగతా మూడు భాషల్లో ఎలాంటి ప్రాబ్లెమ్స్ లేకున్నా… తమిళంలో మాత్రం సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ఏకంగా 25 కట్స్ చెప్పారు. అడల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటంతో సెన్సార్ వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై నిర్మాతలు సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీకి వెళ్లారు. కాజల్ ఈ ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు విని ఆశ్యర్యపోయానని చెప్పుకొచ్చింది. హిందీ వెర్షన్ “క్వీన్” ఎలా ఉందో తమిళంలో కూడా అలాగే తెరకెక్కించాం. అదనంగా ఏమి లేదు. మరి ప్రాబ్లెమ్ ఎక్కడ వచ్చిందో చూడాలన్నారు. నిర్మాతలు ఈ విషయమై రివైజింగ్ కమిటీకి వెళ్లారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు కాజల్. ఇక ప్యారిస్ ప్యారిస్‌కు సెన్సార్ వాళ్లు చెప్పినా అభ్యంతరాల విషయానికొస్తే.. ఈ సినిమా టీజర్‌లో కాజల్ ఛాతిపై అమ్మాయి చేయి వేసి నొక్కుతున్న దృశ్యాన్ని కూడా అలాగే ఉంచేసారు. ఇక టీజర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.కాజల్ గుండెను ఎలీ అవరామ్ ముట్టుకునే సీన్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆడియన్స్ ఈ సినిమా కోసం బాగానే వెయిట్ చేస్తున్నా.. సెన్సార్ బోర్డ్ మాత్రం ఒప్పుకోవడం లేదు.

Related posts