telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆంధ్రా వంటకాలు వండిన కాజల్… పిక్స్ వైరల్

Kajal

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో షూటింగ్స్ అన్నీ బంద్ అయిన విషయం తెలిసిందే. దీంతో తాను సినిమా షూటింగ్స్‌ను ఎంతగానే మిస్ అవుతున్నానని కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది. అంతేకాదు.. రాత్రి డిన్నర్‌లో తన పేరెంట్స్ కోసం ఆంధ్రా వంటల్ని వండింది కాజల్. బెండకాయ పులుసు, సొరకాయ పచ్చడి చేసేసింది. వాటితో పాటు పెసరట్టు కూడా రెడీ చేసింది. తొలిసారిగా తాను ఈ వంటలు చేసినా… తన పేరెంట్స్ తనకు ఫుల్ మార్కులు వేశారని ఎగిరి గంతులు వేస్తోంది ఈ చందమామ. తాను చేసిన వంటల ఫోటోల్ని కూడా తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికే పదముడేళ్లవుతోంది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించేసింది. ప్రస్తుతం కాజల్ ‘భారతీయుడు 2’ సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుంది. ఉదయనిధి స్టాలిన్ మూవీలో నటిస్తుంది.. ఇందుకు గాను భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రమేష్ అరవింద్ దర్శకత్వం లో పారిస్ పారిస్ చిత్రాల్లో నటిస్తుంది.

Related posts