telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాకు ఈ అనుభవం మొదటిసారి : కాజల్

Kajal

కాజల్ అగర్వాల్ వివాహం అయ్యి నెల రోజులు పూర్తి అయ్యింది. కాజల్ అగర్వాల్ మరి కొన్ని రోజుల్లో ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. అతి త్వరలోనే సినిమా కోసం హైదరాబాద్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తానంటూ ఇప్పటికే ప్రకటించింది. నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తానని మాత్రమే చెప్పిన కాజల్‌ ఇప్పుడు కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. వీటిలో కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’, చిరంజీవి ‘ఆచార్య’, దుల్కార్‌ సల్మాన్‌ సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో కాజల్‌ అగర్వాల్‌ ఓ కొత్త సినిమా చేయనుంది. వివరాల మేరకు డైరెక్టర్‌ డీకే తెరకెక్కించే ఓ హారర్‌ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ నటించనుందట. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన కాజల్‌ ఇన్నేళ్లలో ఓ హారర్‌ మూవీలోనూ నటించలేదు. తొలిసారి ఓ హారర్‌ మూవీలో నటించడానికి ఓకే చెప్పిందట. ఇంతకముందు స్టార్ హీరోయిన్లు అనుష్క, నయనతార కూడా ఇలానే హారర్ సినిమాలతో భయపెట్టే ప్రయత్నం చేసి ప్లాప్స్ ను మూటగట్టుకున్నారు. అది చూసి సమంత హారర్ సినిమాలను డ్రాప్ చేసుకుంది. మరి చందమామ కాజల్ ఎంతమేర మెప్పిస్తారో చూడాలి. 

Related posts