telugu navyamedia
సినిమా వార్తలు

కాజల్ 70 కేజీలు ఎత్తి షాకిచ్చిందిగా…!!

Kajal

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్ద కాలం పూర్తయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. ఆమె ఫోటో షూట్స్‌తో అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంటుంది. గ‌త సంవ‌త్స‌రం ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డిన ఈమె ఫిట్ నెస్‌గా ఉండేందుకు నిరంతరం వ‌ర్క‌వుట్ చేస్తూ జిమ్ తో కుస్తీలు పడుతోంది. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ చేసిన వ‌ర్క‌వుట్ వీడియోని ఆమె త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇందులో కాజ‌ల్ 70 కిలోల బ‌రువు ఎత్తింది. ఫిట్‌నెస్ పొంద‌డానికి, భారీ బ‌రువులు ఎత్త‌డానికి త‌న కాళ్ళ‌పై ప‌ని చేస్తున్న‌ట్టు పేర్కొంది. “భారీ బ‌రువులు ఎత్త‌డానికి, అంద‌మైన రూపం పొందడానికి చాలా అభ్యాసం చేయాలి, కోచ్ శ్రీరామ్ వ‌ల‌న నాకు విశ్వాసం పెరిగింది. 70 కేజీల బరువు ఎత్తాను. ఇంకా ముందుకు వెళ్ళాలి” అని కాజ‌ల్ వెల్ల‌డించారు. కొద్ది రోజులుగా హాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉన్న కాజ‌ల్ త్వ‌ర‌లో “ఇండియ‌న్-2” సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నుంది. ఆమె న‌టించిన “ర‌ణ‌రంగం, కోమ‌లి” చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి.

Related posts