telugu navyamedia
సినిమా వార్తలు

“కబీర్ సింగ్” ఫస్ట్ డే కలెక్షన్స్

Kabir-SIngh

టాలీవుడ్లో చిన్న సినిమాగా రూపొందిన “అర్జున్ రెడ్డి” అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయ్ దేవరకొండను స్టార్ రేసులోకి తీసుకొచ్చింది. సందీప్ వంగా దర్శకత్వం ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా “కబీర్ సింగ్” టైటిల్ తో తెరకెక్కించారు. హిందీ వర్షన్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి “కబీర్ సింగ్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షాహిద్ కపూర్ నటనతో అదరగొట్టేశాడు. కథలో పెద్దగా మార్పులు చేయకుండా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సందీప్ వంగా దర్శకత్వం బావుందని అంటున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అనుకున్నట్టుగానే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తొలి రోజున ఈ సినిమా 20 కోట్ల షేర్ ను వసూలు చేసింది. గతంలో షాహిద్ కపూర్ నటించిన బాలీవుడ్ చిత్రం “పద్మావత్” తొలిరోజున 18.21 కోట్లను వసూలు చేయగా, “కబీర్ సింగ్” ఆ రికార్డును అధిగమించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.

Related posts