telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సామాజిక సినిమా వార్తలు

“కబీర్ సింగ్” ప్రభావం… లవర్ ను చంపి యువకుడి ఆత్మహత్య

Kabir-Singh

తెలుగులో సంచలన విజయం సాధించిన “అర్జున్‌ రెడ్డి” చిత్రంతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించారు. ఈ చిత్రం రీమేక్‌ “కబీర్ సింగ్”తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు సందీప్. షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన “కబీర్‌ సింగ్” బాలీవుడ్ లో రికార్డ్ లు క్రియేట్ చేసింది. షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రంపై విమర్శకులు పెదవి విరిచినా ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. అయితే తాజాగా “కబీర్ సింగ్” చిత్రం ప్రభావంతో ఓ యువకుడు తాను ఇష్టపడ్డ యువతికి పెళ్లైందన్న సంగతి తెలిసి ఘాతుకానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశ్వని కుమార్ అలియాస్ ‘జానీ దాదా’ ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు తెలిపారు.

‘కబీర్ సింగ్’ సినిమా చూసిన అశ్వనికుమార్ టిక్‌టాక్‌లో ఆ చిత్రంలోని షాహిద్ కపూర్ సీన్స్‌కు వీడియోలు చేశాడు. సినిమాలో షాహిద్ కపూర్ ప్రవర్తించినట్లుగానే చెడు అలవాట్లకు బానిస అయి టిక్‌టాక్‌లో ఫొటోలు పోస్ట్ చేసేవాడు. తానే విలన్‌నంటూ చేతిలో తుపాకితో వీడియోలు చేస్తూ ‘టిక్‌టాక్ విలన్’గా హల్‌చల్ చేశాడు. ఆ క్రమంలోనే సెప్టెంబర్ 27న బిజ్‌నోర్‌లో స్థానిక బీజేపీ నేత కుమారుడిని, అతని బంధువుల్లో ఒకరిని హత్య చేశాడు. 2002లో బిజ్‌నోర్‌కు చెందిన నికిత శర్మ(27) అనే యువతిని అశ్వని ఇష్టపడ్డాడు. ఆమె అతడి ప్రేమను అంగీకరించలేదు. ఆ సమయంలోనే నికిత చదువు పూర్తి చేసుకుని దుబాయ్‌కు వెళ్లి అక్కడ ఫ్లైట్ అటెండెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఆమెకు పెళ్లి కుదిరిందన్న సంగతి అశ్వనికి తెలిసింది. దీంతో.. డ్రగ్స్‌కు అలవాటు పడి ఉన్మాదిగా మారిన అతను ఆమె ఇంటికి వెళ్లి తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం పోలీసులు అతడి కోసం గాలించారు. వారం రోజుల తర్వాత ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఓ బస్సులో ప్రయాణిస్తున్న అశ్వనిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బస్సులో ఉన్న అతను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నికిత శర్మ హత్య గురించి తెలుసుకున్న ‘కబీర్ సింగ్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఘటనపై స్పందించాడు. ఈ ఘటన దురదృష్టకరమని.. ఆ యువతి కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు. ఎవరినీ చంపమని తన సినిమా చెప్పలేదని, “కబీర్ సింగ్” గానీ, “అర్జున్ రెడ్డి” గానీ హత్యలను ప్రోత్సహించేలా తెరకెక్కించలేదని సందీప్ రెడ్డి చెప్పాడు.

Related posts