telugu navyamedia
సినిమా వార్తలు

వందకోట్ల క్లబ్బులోకి “కబీర్ సింగ్”

Kabir-SIngh

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా “కబీర్ సింగ్” టైటిల్ రీమేక్ చేశారు. హిందీ వర్షన్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి “కబీర్ సింగ్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షాహిద్ కపూర్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాపై బాలీవుడ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా… అమెరికాలో ఈ సినిమాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో రెండో వారం నుంచి (జూన్‌ 28న) 45 సెంటర్లను పొడిగించారు. విదేశాల్లోనూ ఈ సినిమా విశేషమైన వసూళ్లు రాబడుతోందని విశ్లేషకులు వెల్లడించారు. మరోవైపు కేవ‌లం ఐదు రోజుల‌లోనే ఈ చిత్రం 104.9 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన‌ట్టు ట్రేడ్ అనలిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్వీట్‌లో తెలిపారు. తొలి రోజు ఈ చిత్రం రూ.20.21 కోట్లు (శుక్రవారం), శనివారం రూ.22.71 కోట్లు, ఆదివారం రూ.27.91 కోట్లు, సోమవారం రూ.17.54 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. షాహిద్ క‌పూర్ కెరియర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించిన చిత్రంగా “క‌బీర్ సింగ్” నిలిచింది. ఈ ఏడాది విడుద‌లైన చిత్రాల‌లో “భార‌త్” చిత్రం 42.30 కోట్ల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా, “క‌ళంక్” 21.60 కోట్ల‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో “కేస‌రి” ( 21.06 కోట్లు) ఉండగా… నాలుగో స్థానాల్లో “క‌బీర్ సింగ్” నిల‌వ‌డం విశేషం.

Related posts