telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గూగుల్ మోస్ట్ సెర్చెడ్ మూవీగా “కబీర్ సింగ్”

Kabir-SIngh

తెలుగు సంచలన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అయింది. తెలుగులో ఎన్నో సంచలనాలు సృష్టించినట్లుగానే హిందీలో కూడా అనేక సంచలనాలకు కేంద్ర బిందువైంది. ముఖ్యంగా సినిమాకు ఓ వైపు భారీ కలెక్షన్లు, మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలతో కొద్ది రోజుల పాటు అందరి నోటా ‘కబీర్ సింగ్’ అనే మాటే వినిపించింది. ఏదైతేనేం ఈ సినిమా ఇప్పుడు మరో ఘనత సాధించింది. గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన చిత్రంగా ‘కబీర్ సింగ్’ నిలిచింది. సినిమా కేటగిరీలో అన్ని సినిమాలను దాటేసి కబీర్ తొలి స్థానంలో నిలిచింది. ఇక పోతే ఓవర్ ఆల్ సెర్చ్‌లో కూడా నాలుగో స్థానంలో నిలిచింది. సినిమా విభాగంలో కబీర్ సింగ్ తర్వాత అవేంజర్స్: ఎండ్ గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్, సూపర్ 30 చిత్రాలు ఉన్నాయి. ఇక ఓవర్ ఆల్ సెర్చ్‌లో మొదటి స్థానంలో క్రికెట్ వరల్డ్ కప్ నిలిచింది. లోక్‌సభ ఎన్నికలు ద్వితీయ స్థానంలో ఉంది. ఇక చంద్రయాన్2, కబీర్ సింగ్, అవేంజర్స్: ఎండ్‌గేమ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు వెర్షన్‌లో వచ్చినప్పుడు ఈ సినిమాపై అంతగా వ్యతిరేకత రాలేదు. కానీ హిందీ వెర్షన్‌ అనేక విమర్శల్ని ఎదుర్కొంది. అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగనే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్, కైరా అద్వాణీ ప్రధాన పాత్రల్లో నటించారు.

Related posts