telugu navyamedia
సినిమా వార్తలు

రాజమౌళి చేతుల మీదుగా సూర్య “బందోబస్త్” ఫస్ట్ లుక్

Bandobasth

స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేవీ ఆనంద్ దర్శకత్వంలో త‌మిళ స్టార్ హీరోలు సూర్య‌, ఆర్య, మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్‌ ప్ర‌ధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం “క‌ప్పాన్”. ఈ చిత్రంలో ముగ్గురు ప్రముఖ హీరోలు ఉండడంతో ముగ్గురు హీరోల అభిమానులు సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్రలో, సూర్య ఆయ‌న‌కి ర‌క్ష‌కుడి పాత్రలో కనిపించనున్నారు. అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీత సారధ్యం వహిస్తున్నారు. సూర్య సరసన సాయేషా సైగ‌ల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్స‌వం సందర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశ‌భక్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోను విడుద‌ల చేయనున్నారు. అందుకే ఈరోజు రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. “బందోబ‌స్త్” అనే టైటిల్‌తో ఈ చిత్రం తెలుగులో విడుద‌ల కానుంది.

Related posts