telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ జోకులు ప్రారంభించిన పాల్.. జగన్ అడిగితే పెట్టుబడులు తెస్తాడట..

KA Paul comments Chandrababu

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి జోకులు పేలుస్తున్నాడు. ఏపీ సీఎం జగన్ తనను సాయం కోరితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఏపీకి తీసుకొస్తానని ఆఫర్ ఇచ్చారు. ఇన్వెస్టర్లను తీసుకురావాలని తనను కేంద్రమంత్రులు అడిగారన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల సీఎంలు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. జగన్ ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టే.. రెండేళ్ల సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఏపీకి రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ఆదాయం లేకుండా అభివృద్ధి చేయడం కష్టమని చెప్పారు. ఈ విషయం గత ఎన్నికల్లోనే తాను చెప్పానన్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంపై ఏమన్నారంటే… ఇంగ్లిష్ మీడియంలో చదవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కాకపోతే తెలుగుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి.. తర్వాత ఇంగ్లిష్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇంగ్లిష్‌ మీడియానికి మతానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తానెప్పుడూ మత మార్పిడిలకు వ్యతిరేకమని పాల్ వెల్లడించారు.

Related posts