telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూజా హెగ్డే నడుముపై దర్శకేంద్రుడి చమత్కారం… సంచలనంగా మారిన వ్యాఖ్యలు

Valmiki

హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా “జిగర్తాండ”కు ఈ సినిమా రీమేక్. ప్రముఖ తమిళ్‌ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక యంగ్ హీరో నితిన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కన్పించనున్నారట. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా… శోభ‌న్ బాబు, శ్రీదేవి, జ‌య‌ప్ర‌ద ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం “దేవ‌త‌”. ఇందులో శ్రీదేవి, శోభ‌న్ బాబు మ‌ధ్య వచ్చే వెల్లువ‌చ్చె గోదారమ్మ అనే సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందే ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఇందులో బిందెల మ‌ధ్య వీరిద్ద‌రు నృత్యం చేయ‌డం అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తాజాగా ఇదే సాంగ్‌ని సేమ్‌లో స్టైల్‌లో రీమేక్ చేస్తున్నారు “వాల్మీకి” చిత్ర‌బృందం. వ‌రుణ్ తేజ్‌, పూజా హెగ్డేల మ‌ధ్య వెల్లువ‌చ్చె గోదార‌మ్మ రీమేక్ సాంగ్ చిత్రీకరించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.

తాజాగా రాఘ‌వేంద్ర రావు “వాల్మీకి” సినిమాలో “ఎల్లువొచ్చి గోదారమ్మ” పాట లాంచ్ కార్యక్రమానికి వచ్చాడు. ఈ వేడుకలో రాఘ‌వేంద్ర రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాల్మీకిలో దేవత పాట రీమిక్స్ గురించి అంతా బాగానే మాట్లాడాడు ఈయన. సినిమా విజయం సాధించాలని కోరుకున్నాడు. “దేవత” నాడు 25 వారాలు ఆడిందని, ఇది కూడా సంచలన విజయం సాధించాలని ఆశీర్వదించాడు రాఘవేంద్రరావు. పూజా హెగ్డే అందంగా ఉందంటూనే ఆమె నడుమును తాకిన బిందెను తనకు గిఫ్టుగా ఇవ్వాలని చమత్కరించాడు దర్శకేంద్రుడు. ఇది విన్న తర్వాత అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. హీరోయిన్ నడుముపై దర్శకేంద్రుడు చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి. ఆ మధ్య “ఎఫ్-2” మూవీ 50 డేస్ ఫంక్షన్‌కు వచ్చినపుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు ఈయన. ఆ చిత్రంలో అనిల్ హీరోయిన్ల‌ను చాలా అందంగా చూపించాడ‌ని, వాళ్లు బికినీ వేయ‌డం వ‌ల్లే సినిమా విజ‌యం సాధించిందనే అర్థం వ‌చ్చేలా మాట్లాడాడు ద‌ర్శ‌కేంద్రుడు. అది అప్పట్లో సంచ‌ల‌నంగా మారింది. సినిమా అంత పెద్ద విజ‌యం సాధిస్తే.. అది కేవ‌లం బికినీ వ‌ల్ల హిట్ అయింద‌నే అర్థం వ‌చ్చేలా మాట్లాడ‌టం దారుణ‌మే. అయితే రాఘ‌వేంద్ర రావు ఉద్దేశ్యం అది కాక‌పోయినా అనుకోకుండా స‌ర‌దా కోసం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఇప్పుడు పూజా నడుముపై చేసిన కామెంట్స్ కూడా ఇంతే.

Related posts