దక్షిణ కొరియాలో కే-పాప్ సింగర్లలో 28 ఏళ్ల గూ హర హఠాన్మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని తన ఇంట్లోనే ఆమె శవమై కనిపించింది. ఇదివరకు ఈ సింగర్ అండ్ యాక్ట్రెస్… హర… కారా అనే గర్ల్ గ్రూప్‌లో సభ్యురాలిగా ఉంది. ఆదివారం సాయంత్రం ఆమె చనిపోయిన విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఆమె మరణంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ ఆమెతో సెక్స్ చేసి సీక్రెట్‌గా వీడియో తీశాడు. ఆ వీడియోను బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చెయ్యడంతో… ఆమె కోర్టు మెట్లెక్కింది. ఆరు నెలల కిందట ఇలాగే అదే ఇంట్లో గూ హర… అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమె మేనేజర్ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా… సూసైడ్ అటెంప్ట్ చేసిందని డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత కోలుకున్న ఆమె… తన ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పింది. ఈమధ్య ఆమె సొంతంగా కెరీర్ ప్రారంభించి… జపాన్ టూర్ వేసింది. కొత్త సింగిల్ కూడా రిలీజ్ చేసింది. గూ హర చనిపోవడానికి కొన్ని వారాల కిందటే… ఆమె క్లోజ్ ఫ్రెండ్ కే-పాప్ స్టార్ సుల్లీ కూడా సూసైడ్ చేసుకుంది. దశాబ్దకాలంలో సౌత్ కొరియాలో చాలా మంది సెలబ్రిటీలు ఇలాగే ప్రాణాలు తీసుకున్నారు. దక్షిణ కొరియాలో ఇలా చాలా మంది మోసగాళ్లు అమ్మాయిలను సీక్రెట్‌గా వీడియోలు తీస్తున్నారు. ఇలా తీసినవాటిని వెబ్‌సైట్లకు అమ్ముకుంటున్నారు. దీన్ని స్థానికంగా మోల్కా అని పిలుస్తున్నారు. 2017లో 6400 మోల్కా కేసులు బయటపడ్డాయి. 2012లో 2400 కేసులు నమోదయ్యాయి. ఈ విధానంపై చాలా మంది ఆందోళనలు చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
previous post