telugu navyamedia
సినిమా వార్తలు

“బంగార్రాజు”కు నయన్ నో అంటే… జ్యోతిక “ఎస్” అంటుందా ?

jyothi-and-nagarjuna

సరిగ్గా మూడేళ్ళ క్రితం సంక్రాంతికి నాగార్జున ప్రధానపాత్రలో వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన “బంగార్రాజు” పాత్రలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సోగ్గాడే చిన్నిం నాయనా చిత్రానికి సీక్వెల్ గా “బంగార్రాజు” చిత్రాన్ని తెరకెక్కించడానికి ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా నయనతారను తీసుకోవాలని భావించిన చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపారు. అయితే నయనతార తనకు డేట్స్ ఖాళీ లేవని చెప్పారని సమాచారం. దీంతో ఇప్పుడు నాగార్జున కోసం తాజాగా జ్యోతిక పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 15 యేళ్ల క్రితం నాగార్జున సరసన ఆమె “మాస్” సినిమాలో నటించారు. రీ ఎంట్రీ తరువాత ఆచూతూచి కథలను ఎంచుకుంటున్న జ్యోతిక, ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో నాగార్జునతోపాటు నాగ చైతన్య కూడా కీలకపాత్ర పోషించనున్నాడట. నాగార్జున తాత పాత్రలో నటిస్తుండగా… నాగచైతన్య మనవడి పాత్రలో కన్పించనున్నాడని సమాచారం. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనీ భావిస్తున్నారట చిత్రబృందం.

Related posts