telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ హీరోతో డేటింగ్ లో వున్నా… ప్రముఖ క్రీడాకారిణి వ్యాఖ్యలు

Gutta-Jwala

తమిళ్ యంగ్ హీరో విష్ణు విశాల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా ఓపెన్ అయింది. వేలంటైన్స్ డే రోజున విష్ణు విశాల్‌కు ముద్దిస్తున్న ఫోటో షేర్ చేస్తూ ‘ఇతడే నా వేలంటైన్’ అని పోస్ట్ చేసింది జ్వాల గుత్తా. తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తాను విష్ణుతో డేటింగ్ చేస్తున్నట్టు తెలిపింది జ్వాల.. ఇంతకుముందు మీడియా ఎప్పుడు విష్ణు విశాల్‌తో తన రిలేషన్ గురించి అడిగినా ‘అది నా పర్సనల్’ అంటూ మాట దాటవేస్తూ వచ్చిన జ్వాల తన రిలేషన్ గురించి ఓపెన్ అయింది. మేం డేటింగ్‌లో ఉన్నాం. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కానీ త్వరలోనే ఒకటవుతాం.. అప్పుడు తప్పకుండా అందర్నీ ఆహ్వానిస్తాం అంటూ విష్ణుతో తన రిలేషన్‌లో బయటపెట్టింది. 2005లో తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను జ్వాల మ్యారేజ్ చేసుకుంది. 2011లో వీళ్లు విడిపోయారు. విష్ణు విశాల్ వివాహం 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీతో జరిగింది. 2018లో ఈ జంట కూడా విడాకులు తీసుకున్నారు.

Related posts