telugu navyamedia
వార్తలు సామాజిక

నిర్భయ కేసు.. కోర్టులో స్పృహ కోల్పోయిన జస్టిస్ భానుమతి

banumathi judge

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ భానుమతి అస్వస్థతకు గురయ్యారు. నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీసేందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై తీర్పును వెలువరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కళ్లు తిరిగి ఆమె పడిపోయారు. దీంతో, కోర్టు హాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కోర్టు సిబ్బంది ఆమెను హుటాహుటిన ఛాంబర్ కు తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు.

కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసును వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.మరోవైపు జస్టిస్ భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఆరోగ్యం బాగోలేకపోయినా కేసు విచారణ నిమిత్తం వచ్చారని చెప్పారు.

Related posts