telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

ఎండాకాలం .. నీళ్ళకి తెలంగాణా ప్రభుత్వం సరికొత్త ఏర్పాట్లు…

just a call to get bottle of water t.govt

అసలే ఎండాకాలం, ఉండేదేమో సిటీలో.. నీళ్లు తాగటానికి కూడా కనాకష్టం.. దీనితో తెలంగాణ ప్రభుత్వం సరికొత్తగా స్పందించింది. ఆయా డివిజన్ వాసులకు ఇదొక శుభవార్త. నల్లా నీళ్లు రావటం ఆలస్యమైందా..? కనీసం తాగటానికి గుక్కెడు నీళ్లు కూడా ఇంట్లో అందుబాటులో లేవా..? అయినా ఆందోళన చెందకండి. ఒక్క ఫోన్ కొడితే మీ ఇంటి ముందు మినీ వాటర్ ట్యాంకర్ వచ్చి వాలుతుంది. రూపాయి కూడా చెల్లించకుండానే తాగునీటి అవసరాన్ని బట్టి 1-2 బిందెల నీళ్లను ఉచితంగా తీసుకోవచ్చు. బోరబండ డివిజన్‌లోని ప్రజలకు తాగునీటి విషయ మై ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేయాలన్న ఆలోచన డిప్యూటీమేయర్ బాబా ఫసియుద్దీన్ మదిలో మెదిలింది.

ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టారు. మినీ ట్యాంకర్‌ను తయారు చేయించి ఆటో ట్రాలీకి అటాచ్ చేయించారు. ఈ మొబైల్ మినీ ట్యాంకర్‌ను డిప్యూటీమేయర్ సతీమణి ప్రారంభించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, కార్యదర్శి జి.ముత్యాలు, నేతలు సీహెచ్ కవిత, దేవమణి, పద్మ, ఎండీ యూసుఫ్, విద్యావతి, రమేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అర్జంటుగా తాగునీటి సౌలభ్యాన్ని పొందటానికి ఈ ట్యాంకర్ కోసం ఫోన్.. 040-23830666, 9573826801 నెంబర్లకు సంప్రదించవచ్చు. కాగా ఈ తాగునీటిని డివిజన్‌లోని ఎస్సార్టీనగర్‌లో ఉన్న ఆర్వో వాటర్ ప్లాట్ నుంచి సేకరిస్తున్నారు.

Related posts