telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తప్పు చేసిన పోలీసులు… నిరపరాధికి ఏకంగా 350 కోట్ల నష్ట పరిహారం

Jury

ఒహియోలోని ఈస్ట్ క్లేవెలాండ్‌లో నివసించే ఆర్నాల్డ్ బ్లాక్ అనే వ్యక్తి విషయంలో పోలీసులు చేసిన పని తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. అసలేం జరిగిందో ఆర్నాల్డ్ చెబుతూ… ఏడేళ్ల క్రితం ఈస్ట్ క్లేవెలాండ్‌ పోలీసులు అన్యాయంగా నన్ను అరెస్ట్ చేసి టాయిలెట్ కూడా లేని ఓ చిమ్మ చీకటి గదిలో బంధించారు. నాలుగు రోజుల పాటు ఎలాంటి ఆహారపానీయాలు ఇవ్వలేదు. ఆ చీకటి గదిలోంచి ఎలా బయటపడాలో కూడా తనకు ఆ సమయంలో అర్థం కాలేదని ఆర్నాల్డ్ పేర్కొన్నాడు. గది తలుపులను గట్టిగా బాదిన ఎవరూ తనను పట్టించుకోలేదని తెలిపాడు. ఆ 4 రోజులు గదిలో నరకయాతన అనుభవించానని వాపోయాడు. అసలు నేరస్థుడి బదులు తనను అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్రంగా కొట్టడంతో తన తలకు తీవ్రగాయాలయ్యాయని, దాంతో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నాని చెప్పాడు. ఏ నేరం చేయని నన్ను ఇలా నాలుగు రోజులు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారని ఆర్నాల్డ్ కోర్టు ముందు తన గోడును వెళ్లబుచ్చాడు. గత శుక్రవారం ఆర్నాల్డ్ అక్రమ అరెస్ట్ కేసు విచారణకు రావడంతో వాదనలు విన్న కోర్టు అతడికి 50 మిలియన్ డాలర్ల(రూ.358 కోట్ల) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇక 2016లో ఒక జ్యూరీ అతనికి 22 మిలియన్లు ఇచ్చింది. కాని అప్పీల్ కోర్టు దానిని రద్దు చేసింది.

Related posts