telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహిళలను ఎలా గౌరవించాలో ఎన్టీఆర్ కు తెలుసు… : పాయల్

Payal

బాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఇబ్బడి పెట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఎవ‌రో నాకు తెలియ‌దు. ఆయ‌నకి నేను అభిమానిని కాను అన్నందుకు మీరా చోప్రాని ట్రోల్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌. దీంతో ఆమె సైబ‌ర్ క్రైమ్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ‌ల‌న ఎన్టీఆర్‌కి కూడా చెడ్డ పేరు వ‌స్తుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్న నేప‌థ్యంలో పాయ‌ల్ ఘోష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఎన్టీఆర్‌ ఆడ‌వాళ్ళ‌కి ఎలా రెస్పెక్ట్ ఇస్తారో వివ‌రించింది. “మేము బ్యాంకాక్‌లో ఒక పాట కోసం షూటింగ్ చేస్తున్నాము. నేను దుస్తులు మార్చవలసి వచ్చింది. ఆ స‌మ‌యంలో నేను నా బృందం ఒక చిన్న గుడారాన్ని ఏర్పాటు చేశాం. అందులోనే దుస్తులు మార్చుకోవ‌ల‌సి వ‌చ్చింది.. ఆ విష‌యం తెలుసుకున్న ఎన్టీఆర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు . రోడ్డు ప‌క్క‌న మ‌హిళ దుస్తులు మార్చింద‌నే విష‌యం ఎన్టీఆర్‌ని ఎంత‌గానో క‌లిచివేసింది. మహిళలను ఎలా గౌరవించాలో ఆయ‌న‌కి తెలుసు” అంటూ పాయ‌ల్ ఘోష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. ఈ సంఘ‌ట‌న ఊస‌ర‌వెల్లి చిత్ర షూటింగ్ స‌మ‌యంలో జరిగింది.

Related posts