telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బ్యాక్‌లెస్ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తున్న హీరోయిన్

Juhi

బ్యాక్‌లెస్ వీడియోతో సోషల్ మీడియాను ఊపేస్తున్న హీరోయిన్ జూహీ చావ్లా తెలుగులో నాగార్జున హీరోగా నటించిన ‘విక్కీ దాదా’, ‘శాంతి క్రాంతి’ సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత కృష్ణ, రమేష్ బాబు హీరోలుగా నటించిన ‘కలియుగ కర్ణుడు’ సినిమాలో రమేష్ బాబు సరసన మెరిసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైమ్ హిందీలో హీరోగా నటించిన ‘ప్రతిబంధ్’లో చిరు సరనసన నటించింది. ఆ తర్వాత ‘ది జెంటిల్మెన్’ సినిమాలో కూడా ఆడిపాడింది. పెళ్లైన తర్వాత హీరోయిన్ వేషాలకు గుడ్ బై చెప్పినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే ఉంది. తాజాగా జుహీ చావ్లా ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. ఆమె నటించిన ఒకప్పటి సూపర్ హిట్ ‘డర్’ చిత్రంలో ఆమె వర్షంలో తడిసిన తర్వాత బట్టలు మార్చుకునే సీన్.. ఇపుడు సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. ఈ సినిమాతోనే హీరోగా షారుఖ్ ఖాన్.. లైఫ్ టర్న్ తీసుకుంది. ఈ సినిమాలో తూ మేరి కిరణ్ అంటూ షారుఖ్ చేసిన నటనకు జుహీ అందాలు తోడై ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.

Related posts