telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో స్టేషన్‌ ప్రారంభం

metro services till midnight today

హైదరాబాద్ నగర ప్రజలు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులోని మెట్రోస్టేషన్‌ శనివారంప్రారంభమైంది. సాంకేతిక సమస్యలు, నిర్మాణ పనులు జూబ్లీహిల్స్‌ మెట్రో స్టేషన్‌లో పూర్తికావడంతో మెట్రోస్టేషన్ సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్‌ మెట్రో స్టేషన్‌ ప్రారంభంవల్ల హైదరాబాద్‌ మెట్రో రైలు కారిడార్‌-3లోని నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ మార్గంలో అన్ని స్టేషన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లే అయింది.

ఈ స్టేషన్ ప్రారంభంతో నాగోల్-హైటెక్ సిటీ మార్గంలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్టుకాలనీ, నందగిరిహిల్స్‌, తారకరామనగర్‌, దీన్‌దయాల్‌నగర్‌, గాయత్రీహిల్స్‌, కేబీఆర్‌పార్క్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో మెట్రో రైలు సేవలు కొనసాగనున్నాయి. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టాప్‌ ప్రారంభంతో హైటెక్‌సిటీ నుంచి అమీర్‌పేట మార్గంలో ప్రయాణీకుల రాకపోకలు ఎక్కువగా ఉండే అవకాశముంది.

Related posts