telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

జేఎస్సీఏ సభ్యత్వ రుసుము చెల్లించని ధోనీ!

Ms dhoni cricketer

ఝార్ఖండ్ నుంచి భారత జట్టులో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జేఎస్సీఏ (ఝార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్)కు రుసుము చెల్లించాల్సి ఉంది. అసోసియేషన్ కు కట్టాల్సిన రూ.1800 ఇంతవరకు కట్టలేదని, జేఎస్సీఏ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

దీంతో జంషెడ్ పూర్ లో తొలుత గందరగోళం తలెత్తింది. ఆ వెంటనే మాజీ క్రికెటర్ శేష్ నాథ్ పాఠక్, కొందరు విద్యార్థులు, అభిమానులు చందాలు వేసుకుని, డబ్బు సేకరించి అసోసియేషన్ కు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ డబ్బు తీసుకునేందుకు అసోసియేషన్ అంగీకరించలేదు.

వివరాల్లోకి వెళితే గత సంవత్సరం ధోనీకి జేఎస్సీఏ జీవితకాల సభ్యత్వాన్ని ఇచ్చింది. సభ్యత్వ రుసుముగా ధోనీ రూ. 1,800 చెల్లించాల్సి వుండగా, దాన్ని ఇంతవరకూ చెల్లించలేదు. ధోనీ ఇంకా సభ్యత్వ రుసుము చెల్లించలేదని అసోసియేషన్ ప్రకటించింది. తాము చందాలు వేసుకుని ఇచ్చిన డబ్బును తీసుకోని అసోసియేషన్, డ్రాఫ్ట్ తీసి, పోస్టు ద్వారా పంపాలని సూచించిందని శేష్ నాథ్ పాఠక్ మీడియాకు తెలిపారు.

Related posts