telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొడుకుతో హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఎన్టీఆర్!

టాలీవుడ్‌ అగ్రహీరోల్లో ఎన్‌టీఆర్ కూడా ఒకరు. తన నటన, డాన్సులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఎన్‌టీఆర్ నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత వచ్చే పాన్ ఇండియా రేంజ్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎన్‌టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ఎంచుకోవాలి. అయితే ఎన్‌టీఆర్ తన 30వ చిత్రంగా ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అనౌన్స్ చేసాడు. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ తన కొడుకుతో బైక్ ప్రయాణం చేసిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రెండో తనయుడు భార్గవ్‌రామ్‌ను బైక్‌ మీద ఎక్కించుకుని హైదరాబాద్‌ రోడ్ల మీద షికారుకెళ్లాడు. ఎన్టీఆర్ బయట కనిపించే సందర్భాలు అరుదు అనే చెప్పాలి. ఆయన సినిమాలోని షూటింగ్ పిక్స్ కూడా ఎక్కువగా కనిపించవు. ప్రస్తుతం కొడుకుతో ఎన్టీఆర్ బైక్ రైడ్ చేసిన ఫోటోతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 

Related posts