telugu navyamedia
telugu cinema news trending

తలపతి విజయ్ కోసం ఎన్టీఆర్ సింగింగ్…!

NTR

తమిళంలో విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మాస్టర్‌’. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీత దర్శకుడు. ఇటీవల చిత్రంలో ‘కుట్టి స్టోరీ’ పాట విడుదల చేశారు. ఇంతకు ముందు ‘త్రీ’ చిత్రం కోసం అనిరుధ్‌ స్వరపరిచిన ‘వై థిస్‌ కొలవెరి డీ’ తరహాలో ఈ పాట కూడా ఎక్కువగా ఇంగ్లిష్‌ పదాలతో, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అందరికీ అర్థమయ్యేలా సాగింది. ‘లెట్‌ మి సింగ్‌ ఎ కుట్టీ స్టోరీ’ అంటూ హీరో విజయ్‌ స్వయంగా పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. తెలుగులో ‘మాస్టర్‌’ చిత్రాన్ని ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోనేరు విడుదల చేయనున్నారు. ఆయన ఎన్టీఆర్‌ చేత ‘కుట్టీ స్టోరీ’ పాడించాలనుకుంటున్నారట! హీరోని కలిసి విజ్ఞప్తి చేశారట! అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్‌ నోట మరో పాట వినొచ్చు.

Related posts

స్కిట్ నా ఇష్టం… పేరు మీ ఇష్టం… : నాగబాబు

ashok

వాట్ ఏ టాలెంట్ ? : సీతా పాపకు మహేష్ ప్రశంసలు

vimala p

“ఆర్ఆర్ఆర్”లో ఎన్టీఆర్ లుక్ వైరల్…!?

vimala p