telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యంగ్ టైగర్ తో జాన్వీ కపూర్ రొమాన్స్ ?

Jhanvi

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారట అందులో ఒకరిని బాలీవుడ్ నుంచి తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అందుకోసం జాన్వీ కపూర్ పేరు బాగా వినిపిస్తుంది. అంతే కాదు దాదాపు ఆమె ఈ సినిమాలో నటించడం ఖాయమని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా పూజాహెగ్డే , రష్మిక, సమంత ఈ ముగ్గురిలో ఒకరు కన్ఫామ్ కానున్నారు. ఈ సినిమాను పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించనున్నాడు త్రివిక్రమ్. అందులో భాగంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడి వారసుడిలా నటించబోతున్నాడట. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందని టాక్.

Related posts