‘బాహుబలి’ తో రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ‘RRR’ తో కూడా జూనియర్ క్రేజ్ పెంచుకోబోతున్నాడు. రీసెంట్‌గా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఇండియాని ఓడించి కప్ అందుకుంది ఆస్ట్రేలియా. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ ఫైనల్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో ఎన్టీఆర్ సినిమాలోని ఓ పాటను ప్లే చేసారు. ఎన్టీఆర్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో పక్కా లోకల్ సాంగ్ అక్కడ మార్మోగింది. ఆ మ్యాచ్ చూస్తున్న ఒక ఆడియెన్ ఆ పాట రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దానికి ‘జనతా గ్యారేజ్’ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లైక్ కొట్టడంతో ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.
Video – 2#NTR‘s #PakkaLocal song in #Melbourne_Cricket_Stadium, Australia… 🔥🏏#T20WorldCup#JaiBalayya Slogans#JrNTR masss @tarak9999#DarlingKajal❤️ @MsKajalAggarwal..@ThisIsDSP sir 😎.. pic.twitter.com/OVh6fB6faN
— Bangalore NTR Fans® (@BangloreNTRFans) March 8, 2020