telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫోటో వైరల్ : యంగ్ టైగర్ తో ఇద్దరు తనయులు

NTR

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్మీ ప్ర‌ణ‌తి దంపతులకి అభయ్ రామ్‌ అనే నాలుగేళ్ళ కుమారుడు ఉన్నాడు. ఈ దంపతులకు గ‌త ఏడాది జూన్ 14న మ‌రో కుమారుడు జ‌న్మించాడు. ఆ చిన్నారికి భార్గ‌వ్ రామ్ అని నామ‌క‌ర‌ణం చేసిన ఎన్టీఆర్ అప్ప‌ట్లో కంప్లీట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేశాడు. ఈ పిక్ నంద‌మూరి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. భార్గ‌వ్ నేడు తొలి బ‌ర్త్‌డే జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో ఎన్టీఆర్ త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో అపురూప‌మైన ఫోటోలు షేర్ చేశాడు. ఒక ఫోటోలో భార్గ‌వ్‌ని ఎత్తుకొని ఎన్టీఆర్ ఉండ‌గా, మ‌రొక ఫోటోలో అభ‌య్, భార్గ‌వ్‌లు ఇద్ద‌రు క‌లిసి ఫోటోకి ఫోజిచ్చారు. ఈ ఫోటోలు ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్నాయి. ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” చిత్రంతో బిజీగా ఉన్నాడు. కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల కానుంది.

Related posts