• Home
  • వార్తలు
  • బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్…! పాత్ర గురించి వివరించిన క్రిష్
Trending Today వార్తలు సినిమా వార్తలు

బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్…! పాత్ర గురించి వివరించిన క్రిష్

ntr

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ‘బయోపిక్’ క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తుండగా, చంద్రబాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్యా బాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ హాట్ గాసిప్ తెర‌పైకి వ‌చ్చింది.. ఈ సినిమాలో నందమూరి మనవడు..

ntr biopic

యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ కూడా క‌నిపించ‌బోతున్నాడు అన్నవార్త సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తుంది… కాగా దర్శకుడు క్రిష్ యంగ్ టైగర్ ని కలిసి పాత్ర గురించి వివరించడం… తారక్ ఓకే చెప్పడం అన్ని జరిగిపోయాయని సమాచారం…. ఎన్టీయార్ రాక‌తో ఈ సినిమాకు మ‌రింత హైప్ రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.. కాగా ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి అంత సిద్ధమైంది…

తొలిభాగాన్ని’ఎన్టీఆర్ కథానాయకుడు’గా, రెండో భాగాన్ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా రూపొందిస్తున్నారు. అంతేకాదు ఆ రెండు భాగాల విడుదల తేదీని కూడా ప్రకటించారు. 9 జనవరి 2019న మొదటిభాగం, 24 జనవరి 2019 రెండో భాగం విడుదలవుతుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి…






 

Related posts

స్వలింగ సంపర్కం ఏఏ దేశాలలో నేరం… ఏఏ దేశాలలో నేరం కాదో తెలుసా ?

vimala t

భలే మంచి చౌకబేరం మూవీ టీం తో డైరెక్టర్ మారుతీ.. ‘చిత్రాలు’…

chandra sekkhar

కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

madhu

Leave a Comment