telugu navyamedia
political

బీజేపీ ప్రెస్ మీట్ కు హెల్మెట్లు ధరించి వెళ్లిన జర్నలిస్టులు

ఓ మీడియా సమావేశంలో జర్నలిస్టు సుమన్‌ పాండేపై కొందరు బీజేపీ నేతలు ఇటీవల దాడి చేశారు. ఈ ఘటనలో అతడి తలకి గాయమైంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి జర్నలిస్టులు మైక్‌, కెమెరాలతో పాటు హెల్మెట్లు ధరించి వచ్చారు. జర్నలిస్టు పై దాడిని నిరసిస్తూ తాజాగా జర్నలిస్టులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. 
రాయ్‌పూర్‌లో స్థానిక బీజేపీ నేతలు నిర్వహించిన కార్యక్రమానికి విలేకరులు హెల్మెట్లు పెట్టుకుని వచ్చారు. ఇటీవల జరిగిన ఘటనకు నిరసనగా మేం హెల్మెట్లు పెట్టుకున్నాం.  ఒకవేళ వారు( బీజేపీ నేతలు ) మళ్లీ మాపై దాడి చేసినా హానీ జరగకుండా ఉండేందుకే ఇలా ముందుగా జాగ్రత్త పడ్డాం అని విలేకరులు తెలిపారు.

Related posts

లాలూకు బెయిల్‌ మంజూరు

vimala p

బీజేపీ అస్త్రం.. బరిలోకి దిగనున్న అద్వానీ .. !!

vimala p

సమాజం కోసమే రాజకీయాల్లోకి: ప్రకాశ్‌రాజ్‌

vimala p