telugu navyamedia
సినిమా వార్తలు

హేమ వ్యాఖ్యలపై శ్వేతారెడ్డి ఫైర్… మీలాంటి వారికి అలవాటేమో…

Hema

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు బిగ్‌బాస్ షో మూడో సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. తెలుగులో రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని మూడో ప్రారంభం కాబోతున్న రియాల్టీ షో “బిగ్‌బాస్‌”ని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ షోపై ఇప్పటికే యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ షో ప్రసారాన్ని నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ఇప్పటికే పిల్‌ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఈ రియాల్టీ షోపై నటి హేమ స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బిగ్‌బాస్‌-3ని ఆపలేవంటూ.. ఈ షోకి తన మద్దతు తెలిపారు. అంతేకాకుండా క్యాస్టింగ్‌ కౌచ్‌ లాంటివి ఈ షోలో ఉంటే నాగార్జున లాంటి పెద్ద హీరో హోస్ట్‌గా చేయడానికి ఎందుకు ఒప్పకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన యాంకర్ శ్వేతారెడ్డి మాట్లాడుతూ..

“హేమగారూ.. మీలాంటి వారికి ఈ కండీషన్లు, క్లాజులు, మీ సినిమా అగ్రిమెంటులో భాగంగా ఒప్పుకోవడం అలవాటేమో? ఈ అగ్రీమెంట్స్ లో భాగంగా 100 రోజులు నువ్వు సెక్స్ లేకుండా ఎలా మేనేజ్ చేయగలవు అంటూ అడుగుతున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్. బిగ్ బాస్ లో జరుగుతున్న వేధింపులు గురించి మేము మాట్లాడుతుంటే. మీరు పబ్లిసిటీ కోసం కేసులు పెట్టారని మాపై నిందలు వేస్తారా? ఇండస్ట్రీలో ఓ పొజిషన్ లో ఉన్న మీరు ‘మా’ ఎన్నికల సందర్భంగా స్టేజ్ మీద ఎలాకొట్టుకున్నారో ప్రజలంతా చూసారు. మేము అలాకాదు. మేము వేసిన కేసుల ద్వారా బిగ్ బాస్ సెలక్షన్లో వారు ఎంత నీచంగా, అసభ్యకరంగా ప్రవర్తించారో.. మొదలగు విషయాలు అన్ని బయటకు వస్తాయి. నాగార్జున గురించి, నాగార్జున గారి కుటుంబం గురించి ఆయన్ను అభిమానించే వ్యక్తిగా మీకన్నా నాకు బాగా తెలుసు. సెక్స్ రిలేటెడ్ కన్వర్జేషన్లు చేస్తున్న కో ఆర్డినేటర్లు ద్వారా రన్ అయ్యే బిగ్ బాస్ షోను చేయడం కరెక్ట్ కాదని.. ఇదే విషయాన్ని నాగార్జున గారితో వినమ్రంగా నివేదించుకున్నాను. అంతే తప్ప ఆయన్ను వ్వక్తిగతంగా ఏమీ అనలేదు” అంటూ శ్వేతారెడ్డి ఫైర్ అయ్యారు.

Related posts