telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇండోనేసియా అధ్యక్షుడుగా జోకో విడోడో … రెండోసారి బాధ్యతల స్వీకరణ..

joko widodo as president of indonesia

నేడు జోకో విడోడో రెండోసారి ఇండోనేసియా అధ్యక్షుడుగా బాధ్యతలను స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా సైనిక దళాలు, పోలీసు దళాలు, సాయుధ శకటాలు, అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లను రోడ్లపై విస్తృత స్థాయిలో మోహరించారు. ప్రధాన రహదారులను మూసివేశారు. ఈ నెల 10వ తేదీన ఇస్లామిక్‌ మిలిటెంట్‌ జంట దేశ హోం మంత్రిపై కత్తిదాడి చేయటంతో ఈ విస్తృత స్థాయి భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తన గత పదవీ కాలంలో సంక్షోభంలో వున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు వినిమయ చర్యలు ప్రారంభించిన విడోడో రెండోసారి పదవీ స్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు.

దీనితో గుర్రపు బగ్గీలో తన నివాసం నుండి కార్యక్రమ వేదిక వద్దకు బయల్దేరిన ఆయనకు దారి పొడవునా వేలాది మంది మద్దతుదారులు హర్షధ్వానాలతో అభినందనలు తెలియచేశారు. మార్గమధ్యంలో భద్రతా వలయాన్ని తప్పించుకుని తన బగ్గీ నుండి బయటకు వచ్చిన విడోడో తన మదదతుదారులతో కరచాలనం చేసి వారిని సంతోషపెట్టారు. ప్రజలు రెండోసారి దేశ పాలనా బాధ్యతలను తనకు అప్పగించటం పట్ల హర్షం వ్యక్తం చేసిన విడోడో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు తాను తక్షణ ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం తాను, తన మంత్రివర్గం సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ప్రమాణస్వీకారం ముగిసిన తరువాత ఆయన మంత్రివర్గ నిర్మాణం కోసం పార్లమెంట్‌కు బయల్దేరి వెళ్లారు.

Related posts