telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తికరంగా “జోకర్” ట్రైలర్

Joker

ఆస్కార్ నామినేట్ ఫిలిం మేక‌ర్ టాడ్ ఫిలిప్స్ ద‌ర్శ‌క‌త్వంలో జాక్విన్ పోనిక్స్ ప్ర‌ధాన పాత్రలో రూపొందుతున్న హాలీవుడ్ చిత్రం “జోక‌ర్”. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ వైరల్ గా మారి, కోటికి పైగా వ్యూస్ రాబట్టడం విశేషం. హాస్యనటుడు ఆర్థర్ ఫ్లేక్ ట్విస్టెడ్ కథ నేప‌థ్యంలో “జోక‌ర్” మూవీ సాగ‌నుంది. ఆర్థ‌ర్ ఫ్లేక్ పాత్ర‌లో జాక్విన్ అద్బుతంగా న‌టించారు. జోక‌ర్‌గా ఆయ‌న న‌ట‌న నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. బ్యాక్ డ్రాప్‌లో వ‌స్తున్న‌ నాట్ కింగ్ కోలే సాంగ్ అల‌రిస్తుంది. ఈ చిత్రంలో రాబ‌ర్ట్ ఫోనిక్స్, ఫ్రాన్సెస్ కోన్రాయ్, జాజీ బీట్జ్, మార్క్ మారోన్,తదితరులు కీలక పాత్ర‌ల‌లో న‌టించారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 4న విడుదల కానుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts