telugu navyamedia
telugu cinema news trending

బాలీవుడ్ హీరోహీరోయిన్లు తెలుగులో… వీడియో వైరల్

iliyana on her break up

పరభాషకు చెందిన వాళ్లు తెలుగులో మాట్లాడుతుంటే మన ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా బాలీవుడ్ హీరోల జాన్ అబ్రహం, అనిల్ కపూర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాగల్ పంతీ సినిమా రిలీజ్ సందర్భంగా.. ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈ చిత్రబృందం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించింది. చిత్ర నటులు అనిల్ కపూర్, జాన్ అబ్రహం, అర్షద్ వార్షి, కృతి కర్బందా, ఇలియానా తమ చిన్ననాటి కబుర్లతో సందడి చేశారు. అనిల్, జాన్ అబ్రహం తెలుగులో మాట్లాడటం హైలెట్‌గా నిలిచింది. కృతి కర్బందా సహకారంతో ఈ ఇద్దరు హీరోలు తెలుగులో మాట్లాడారు. ‘‘అందరికీ నమస్కారం. నవంబర్ 22న మా సినిమా రిలీజ్ అవుతోంది. తప్పకుండా చూడండి. ప్లీజ్ చూడండి’’ అని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఇలియానా కూడా తెలుగులో మాట్లాడుతూ.. ‘‘అందరినీ ప్రేమిస్తున్నాను. తెలుగు వాళ్లపై చాలా ప్రేమ ఉంది’’ అని వ్యాఖ్యానించింది.

Related posts

హాట్ యాంకర్ అనసూయ బాలీవుడ్ ఎంట్రీ ?

vimala p

అక్కడ కొలనులో నీళ్లు తాగితే … జబ్బులు మాయమేనట.. మన తెలంగాణలోనే..

vimala p

విద్యార్థుల భవిష్యత్తుపై .. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం .. : పవన్

vimala p