telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఇస్రోలో ఉద్యోగాలు.. త్వరపడాలి..

jobs notifications from diff dept.s

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్-షార్ కోసం పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో. సైంటిస్ట్ / ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇస్రో. కెమికల్, ఇండస్ట్రియల్, పవర్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ లాంటి విభాగాల్లో సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులు ఉండగా, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. మొత్తం 21 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 18 చివరి తేదీ.

మొత్తం ఖాళీలు- 21సైంటిస్ట్ / ఇంజనీర్- 19
మెడికల్ ఆఫీసర్- 2

దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 18 సాయంత్రం 5 గంటలుదరఖాస్తు ఫీజు- రూ.100

నోటిఫికేషన్ కోసం, దరఖాస్తు చేయడానికి : https://www.shar.gov.in/ చూడగలరు.

Related posts