telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో .. ఉద్యోగాలు …

jobs notification from indian oil corporation

భారత ప్రభుత్వ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్. ఈ సంస్థకి చెందిన సదరన్ రీజియన్ దాదాపు 413 ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాలీలకి గాను అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులని కోరుతోంది.

పోస్టుల వివరాలు.. :

1. ట్రేడ్ అప్రెంటీస్ – 353
అర్హత : పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

2. టెక్నీషియన్ అప్రెంటీస్ : 60.
అర్హత : సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు : 2019, జూలై 31 నాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక : రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆఖరుతేదీ : ఆగస్టు 7, 2019.
పరీక్షతేదీ: ఆగస్టు 18, 2019.

మరిన్ని వివరాలకై సంస్థ వెబ్సైటు చూడవచ్చు : www.iocl.com

Related posts