telugu navyamedia
news study news Telangana trending

హైదరాబాద్ : … పోలీసు కమిషనరేట్‌ భరోసా కేంద్రంలో … మహిళలకు ఉద్యోగాలు..

jobs for women in police bharosa kendram

పోలీసు కమిషనరేట్‌ భరోసా కేంద్రంలో ఒప్పంద పద్ధతిలో ఉద్యోగం చేసేందుకు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ భరోసా కేంద్రంలో మహిళ క్లినికల్‌ సైకాలిజిస్టుగా, మహిళ సోషల్‌ కౌన్సిలర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపికైన మహిళ అభ్యర్ధులు కొండాపూర్‌ ఏరియా దవాఖనలోని భరోసా కేంద్రం, సపోర్ట్‌ సెంటర్‌ ఫర్‌ మహిళలు, బాలిక కేంద్రంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కేంద్రం సైబరాబాద్‌ పోలీసు అధ్వర్యంలో నడుస్తుందని సీపీ సజ్జనార్‌ తెలిపారు.

ఆసక్తి గలవారు www.cyberabad police.gov.in వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని సీపీ చెప్పారు. నవంబరు 20వ తేది సాయంత్రం ఐదు గంటల లోపు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని సీపీ కోరారు. క్లినికల్‌ సైకాలిజిస్టు పోస్టుకు ఐదేండ్ల అనుభవం, ఎమ్‌ఎస్‌డబ్ల్యూ లేదా క్లినికల్‌ సైకాలజీ అర్హత ఉండాలి. వీరి వయస్సు 35-55 వరకు ఉండాలి. నెలకు రూ.35 వేల జీతం ఉంటుంది. మహిళ సోషల్‌ కౌన్సిలర్‌ పోస్టుకు ఎమ్‌ఎస్‌డబ్ల్యూ, సోషియాలజీలో పీజీ 3సంవత్సరాల అనుభవం, ఆంగ్లం,హిందీ, తెలుగు, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం ఉండాలి. వయస్సు 20-35 సంవత్సరాలు ఉండాలని సీపీ వివరించారు.

Related posts

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ ?

vimala p

కోడెల మృతిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

vimala p

బాలకృష్ణ అహంకారంపై నాగబాబు కామెంట్

vimala p