telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు .. అర్హులు దరఖాస్తు చేసుకోగలరు..

jobs notifications from diff dept.s

రక్షణ రంగానికి చెందిన ఎలక్ట్రానికి పరికరాలు, ఆయుధాలని వివిధ వస్తువులని బద్రపరిచేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్య కార్యకలాపాలు. భారత దేశంలోనే అతిపెద్ద మరియు విభిన్న పరిశోధనా సంస్థగా పేరొందింది. సుమారు 5000 మంది శాస్త్రవేత్తలు, 28 వేలకి పైగా వివిధ రకాల ఉద్యోగులతో ఉన్న ఈ సంస్థ తాజాగా వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

పోస్టుల వివరాలు : మల్టీ టాస్కింగ్

మొత్తం పోస్టుల సంఖ్య : 1,817

అర్హత :10 th పాస్ అయ్యి ఉండాలి, లేదా సంభందిత ట్రేడులలో ఐటీఐ చేసి ఉండాలి.

వయసు : 25 ఏళ్ళు మించి ఉండరాదు.

వేతనం : రూ. 18000 , నుంచీ 56,900/-

దరఖాస్తు ఫీజు : జనరల్ వారికి రూ. 100 /- ఎస్సీ , ఎస్టీ, వికలాంగులకి ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం :ఆన్లైన్
చివరి తేదీ : 23-12-2019

మరిన్ని వివారాలకోసం : http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10301_121_1920b.pdf
————————————————————————-
కోల్ ఇండియా లిమిటెడ్ భారీగా ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ కోసం నోటిఫికేషన్స్ ప్రకటించింది. మొత్తం 1326 ఖాళీలున్నాయి. ఇందులో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అలాగే ఇంజనీరింగ్‌లో సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 21న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.coalindia.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూసుకోవచ్చు.

ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీలు- 1326 మైనింగ్- 288 ఎలక్ట్రికల్- 218 మెకానికల్- 258 సివిల్- 68కోల్ ప్రిపరేషన్- 28 సిస్టమ్స్- 46 మెటీరియల్స్ మేనేజ్‌మెంట్- 28 ఫైనాన్స్ అండ్ అకౌంట్స్- 254 పర్సనల్ అండ్ హెచ్ఆర్- 89 మార్కెటింగ్ అండ్ సేల్స్- 23 కమ్యూనిటీ డెవలప్‌మెంట్- 2
————————————————-
హైదరాబాద్ : ఈ నెల 20న నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలను కల్పించేందుకు నగరంలోని మల్లేపల్లి బాలుర ఐటీఐ క్యాంపెస్ ఉపాధి కార్యాలయంలో మీడియం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ అండ్ గైడెన్స్ బ్యూరో (యుఈఐ/జీబీ) డిప్యూటీ చీఫ్ అధికారి ఎన్.ఆనంతరెడ్డి తెలిపారు. ఒప్పో మొబైల్స్, యాక్సిస్ బ్యాంకు, అపోలో హోంకేర్, చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్, కార్వీ ఫోర్డ్ సర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, హాయ్ కేర్ సర్వీసెస్, శుభగృహ ప్రాజెక్ట్సు, పేరంగ్రూప్, కాలీబ్ హెచ్‌ఆర్, సెంటినీ బయోఫ్లాంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్ట్ ఫైబర్‌నెట్ తదితర ప్రైవేట్ కంపెనీలో హైదరాబాద్ నందు పనిచేయుటకు దాదాపు 900 ఉద్యోగాల ఎంపికకు ఈ మీడియం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఆసక్తి గల జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో 20వ తేదీలోపు జిల్లా ఉపాధి కార్యాలయం/మోడల్ కెరియల్ సెంటర్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు రఘుపతిని 8247656356, 8886884049లలో సంప్రదించవచ్చన్నారు.

Related posts