telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

హైదరాబాద్ : .. జాబ్ మేళా .. సంస్థల చేయూత..

free house plans from ghmc soon

నగరంలో యూసీడీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరు కావటంతో పాటు అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ సర్కిల్ 17 పరిధిలో ఈ నెల 11న ఆర్టీసీ క్రాస్‌రోడ్ అశోక్‌నగర్ రామకృష్ణమఠ్ వద్దగల జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.

18 – 30 ఏండ్లు ఉన్న యువతీ, యువకులు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలి. మహిళా పొదుపు సంఘాలు, ఆరోగ్య సమితి సభ్యులకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు సర్కిల్ డీపీవో సంధ్యారాణి తెలిపారు. ఆరోగ్య ధూత్ (బెడ్‌పై ఉన్న పెషంట్లకు సేవలందించే నర్సింగ్ అసిస్టెంట్), సోలార్ ప్యానెల్ ఇస్టాలేషన్ టెక్నిషియన్, అకౌంట్స్ ప్యాకేజీ (ట్యాలీ), జూనియర్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్, బ్యాంకింగ్ సేల్స్ అసోసియేట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్, హోటల్ మేనేజ్‌మెంట్, హౌజ్ కీపింగ్, రిటైల్ సేల్స్ అసోసియేట్, కన్‌సైన్మెంట్ బుకింగ్ అండ్ ట్రాకింగ్ ఎగ్జిక్యూటీవ్స్, సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాల్లో అవకాశం ఉంటుంది.

ఈ మేళాలో పాల్గొంటున్న వివిధ సంస్థలు.. నైస్ ఫౌండేషన్, ఏపీసీసీ, స్కిల్ ప్రో, ఒరియన్ సెక్యూరిటీ సర్వీసెస్, అపోలో మెడిస్కిల్స్, రైజ్, స్కిల్ టెక్, ఓలా క్యాబ్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అవసరమైన వారికి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. జాబ్ మేళాకు హాజరయ్యే వారు విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఓలా క్యాబ్స్‌లో ఉద్యోగాల కోసం డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాల్సి ఉంటుంది. ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్‌డ్ బేసిస్ పద్ధతిలో ఎంపిక ఉంటుంది.

Related posts