telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ఫార్మా వాళ్లకు .. ఉద్యోగ మేళ… త్వరపడాలి..

job mela for pharma certified

గత కొద్ది రోజుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఫార్మారంగంలో ఉత్పత్తి, పరిశోధన విభాగాలకు సంబంధించి జాబ్ మేళా నిర్వహించేందుకు నిఖిల్ ఫౌండేషన్ చొరవ తీసుకుంటుందని సంస్థ చైర్మన్ డాక్టర్ చిక్కాల వేణుగోపాల్‌రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడిస్తూ.. ఫార్మసీ, ఎంఎస్‌సీ, బీఎస్‌సీలు పూర్తి చేసి ఫార్మా రంగంలో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం ఈ నెల 10, 11వ తేదీల్లో జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు.

మరిన్ని వివరాలకు 7396342168 తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. ఈ మేళాను నగరంలోని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ప్రధాన రహదారిలోని భాను ఎన్‌క్లేవ్‌లోని 2వ అంతస్థులోని సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఎంపికైన అభ్యర్థ్ధులకు అక్కడికక్కడే నియామకపు పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు.

Related posts