telugu navyamedia
సినిమా వార్తలు

ఆయనను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా… : బ్రాడ్ పిట్ మాజీ భార్య

Brad-Pitt

హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ కు హాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణాలు ఎక్కువ. ఆయన సినిమాల కన్నా ఎక్కువ ప్రేమాయణాలతోనే వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అతడి మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “బ్రాడ్ పిట్ నన్ను వద్దనుకున్నారు. కానీ తాను మాత్రం ఆయన్ని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా. నాతో కలసి జీవించాలని ఆయన్ని బలవంతం చేయలేను. మేమిద్దరం విడిపోయిన సందర్భంలో మా మార్గాలు వేర్వేరు అని అనుకున్నాం. అందుకే విడిపోయాం. కానీ బ్రాడ్ పిట్ జీవితంలో తాను కూడా భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా… బ్రాడ్ పిట్ ని వివాహం చేసుకున్న తర్వాతే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది” అని తెలిపింది. బ్రాడ్ పిట్, అనిస్టన్ 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత బ్రాడ్ పిట్, హాట్ బ్యూటీ ఏంజెలినా జోలీ మధ్య ప్రేమాయణం సాగింది. ఈ జంట 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రెండేళ్ల తర్వాత ఏంజెలినా నుంచి కూడా బ్రాడ్ పిట్ విడిపోయాడు. ప్రస్తుతం బ్రాడ్ పిట్ సింగిల్ గానే ఉన్నాడు.

Related posts